గర్భం దాల్చిన మైన‌ర్ బాలిక‌.. అబార్షన్ మాత్రలు వేయ‌డంతో..

Pregnant minor dies after taking abortion pill in Tamil Nadu. తమిళనాడులో ఓ 15 ఏళ్ల బాలిక అబార్షన్ మాత్రలు వేసుకుని ప్రాణాలు కోల్పోయింది.

By Medi Samrat
Published on : 1 July 2022 3:59 PM IST

గర్భం దాల్చిన మైన‌ర్ బాలిక‌.. అబార్షన్ మాత్రలు వేయ‌డంతో..

తమిళనాడులో ఓ 15 ఏళ్ల బాలిక అబార్షన్ మాత్రలు వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా చెంగం సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలు.. ఎస్ మురుగన్ (27) అనే వ్యక్తి ద్వారా గర్భం దాల్చిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. మురుగన్ బాలిక‌ను రోజూ స్కూల్ ద‌గ్గ‌ర‌ దింపుతుండేవాడు. ఆ సమయంలో వారిద్దరూ సంబంధాన్ని పెంచుకున్నారు.

బాలిక ఇటీవలే గర్భం దాల్చింది. దీంతో మురుగన్ తన స్నేహితుడు ప్రభు (27) సహాయంతో అబార్షన్ మాత్రలు సంపాదించాడు. ఆ త‌ర్వాత‌ పాఠశాలకు తీసుకెళ్తాననే నెపంతో బాలికను ఆమె ఇంటి నుంచి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో అబార్షన్ మాత్రల‌ను తాగించారు. అనంత‌రం పాఠశాల వైపు వెళ్తుండ‌గా.. బాలిక అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో మురుగన్ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలోని వైద్యులు బాలిక అప్ప‌టికే చనిపోయిందని తెలిపారు. అక్క‌డి నుండి బాలిక‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మురుగన్‌, అతని స్నేహితుడు ప్రభుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురుగన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరికి అబార్షన్ పిల్స్ ఇచ్చిన వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.














Next Story