చర్చికి వ‌చ్చే బాలికలకు లైంగిక వేధింపులు.. పాస్టర్‌ అరెస్ట్‌

Pastor arrested for sexually harassing girls at church in TN’s Rameswaram. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు.

By Medi Samrat
Published on : 9 Aug 2022 2:20 PM IST

చర్చికి వ‌చ్చే బాలికలకు లైంగిక వేధింపులు.. పాస్టర్‌ అరెస్ట్‌

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు చర్చి పాస్టర్‌ను అరెస్టు చేశారు. చర్చికి వచ్చే బాలిక‌ల‌ను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జాన్ రాబర్ట్ అనే పాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వివ‌రాళ్లోకెళితే.. రామేశ్వరం మండపం ప్రాంతంలోని పునీతర్ అరుల్ ఆనందర్ చర్చిలో జాన్ రాబర్ట్ అనే పాస్టర్ ఉంటున్నాడు. చర్చికి వచ్చే బాలిక‌లను లైంగికంగా వేధించాడన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మేర‌కు లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు.

బాధితుల‌ ఫిర్యాదు ఆధారంగా.. శిశు సంక్షేమ అధికారులు జాన్ రాబర్ట్ పై వ‌చ్చిన‌ ఆరోపణలపై రహస్యంగా విచారణ చేపట్టారు. జాన్ రాబర్ట్ బాలికలను లైంగికంగా వేధించాడని విచారణలో నిర్ధారించారు. ఆపై పాస్టర్‌పై మండపం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాస్టర్‌ను అరెస్టు చేసి.. అత‌డిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.









Next Story