ఐసీయూలో చికిత్స పొందుతున్న‌ మహిళపై అత్యాచారం

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

By Medi Samrat  Published on  27 Feb 2024 2:47 PM GMT
ఐసీయూలో చికిత్స పొందుతున్న‌ మహిళపై అత్యాచారం

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మహిళను ఆస్పత్రిలో చేర్చి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమె స్పృహ కోల్పోయేలా చేయడానికి నిందితుడు ఇంజెక్షన్ ఇచ్చాడని విచారణలో తేలింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడిందని పోలీసు అధికారి తెలిపారు.

భర్త ఆమె మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనను వివరించింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. అతను బెడ్‌పైకి వెళ్లి కర్టెన్‌లను అడ్డం పెట్టిన సిసిటివి ఫుటేజీని కూడా మేము పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Next Story