మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తల్లీ కుమార్తె మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన హవేళిఘనపూర్ దగ్గర సోమవారం ఉదయం ఘెర ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తీవ్ర గాయాలపాలైన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్తు బోల్తా పడటానికి ప్రధాన కారణంగా అతి వేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ప్రమాద బాధితులంతా హైదరాబాద్ చెందినవారు కాగా.. వారంతా అజ్మీర్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.