తల్లితో పాటు మరో ఇద్దరిని హత్య చేసిన మానసిక రోగి

Mentally ill man kills mother, two others in J-K's Anantnag. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి

By Medi Samrat  Published on  24 Dec 2022 8:06 PM IST
తల్లితో పాటు మరో ఇద్దరిని హత్య చేసిన మానసిక రోగి

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తన తల్లితో పాటు మరో ఇద్దరిని హత్య చేశాడు. జావైద్ అహ్మద్ అనే వ్యక్తి అష్ముకం ప్రాంతంలో కర్ర తీసుకుని తన తల్లితో పాటు మరో ఇద్దరిపై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురూ మరణించగా, మొత్తం ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. మృతులను హఫీజా, గులాం నబీ, మహ్మద్ అమీన్‌లుగా గుర్తించారు.

మద్యానికి బానిసైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు దాడి చేస్తున్న సమయంలో చాలా మంది అతనిని అడ్డుకోడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంత్‌నాగ్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) ఆసుపత్రికి వారిని రిఫర్ చేశారు.


Next Story