సౌదీ అరేబియాలోని ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నందుకు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID) అరెస్టు చేసింది. తన సోషల్ మీడియాలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేస్తూ.. ఇతర మతాలను కించపరిచేలా పోస్టులను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు రాజా మహ్మద్ తిరువళ్లూరులోని తన బంధువుల నివాసంలో ఉంటూ మాంసం దుకాణంలో పని చేస్తుండేవాడని విచారణలో తేలింది.
రాజ్ మహ్మద్‌కు సౌదీ అరేబియాలోని ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతను సిగ్నల్ అప్లికేషన్ ద్వారా వారితో కమ్యూనికేట్ చేస్తున్నాడని తెలిసింది. రాజా మహమ్మద్‌ను కూడా సౌదీకి ఆహ్వానించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అతనికి పాస్‌పోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా సిబి-సిఐడి రాజ్ మహ్మద్‌ను అరెస్టు చేసింది. అతని సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులు, అతను ఇస్లాంను ప్రచారం చేస్తూ, ఇతర మతాలను కించపరిచే పోస్ట్‌లను పెడుతూ ఉన్నాడని కనుగొన్నారు. రాజా మహమ్మద్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.