ప్రైవేట్ పార్ట్ చూపించిన కామాంధుడికి మహిళ ఎలాంటి శిక్ష విధించిందంటే.?

కోల్‌కతాలో మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసుతో దేశం అట్టుడుకుతున్న వేళ.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించిన వ్యక్తికి మహిళ షాక్ ఇచ్చింది

By Medi Samrat  Published on  17 Aug 2024 3:41 PM IST
ప్రైవేట్ పార్ట్ చూపించిన కామాంధుడికి మహిళ ఎలాంటి శిక్ష విధించిందంటే.?

కోల్‌కతాలో మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసుతో దేశం అట్టుడుకుతున్న వేళ.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించిన వ్యక్తికి మహిళ షాక్ ఇచ్చింది. లోహపు గరిటెతో అతని ప్రైవేట్ భాగాలను కాల్చేసింది. అతడి అకృత్యాలను ఆపడానికి 26 ఏళ్ల మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వార్తా సంస్థ PTI నివేదించింది. 30 ఏళ్ల అనిల్ సత్యనారాయణ అనే వ్యక్తి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. భివాండి ప్రాంతంలోని వ్యక్తి తన నివాసానికి దగ్గరలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని అధికారి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్త్రీ, పురుషులిద్దరూ ఒకరికొకరు తెలుసు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అనిల్ సత్యనారాయణ మహిళ ఇంటికి వెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుండి తనను తాను రక్షించుకోవడానికి స్త్రీ వంటగదికి పరుగెత్తింది. ఒక గరిటెని తీసుకుంది. మహిళ చేసిన దాడిలో అతని జననాంగాలకు గాయమైంది. సదరు వ్యక్తి వైద్య సహాయం కోసం ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. అతన్ని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు.మహిళ ఫిర్యాదు మేరకు భివండి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఇంకా ఆసుపత్రిలో ఉన్నందున అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు

Next Story