Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat  Published on  6 Jun 2024 9:32 AM IST
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్థులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే గురువారం ఉదయం మళ్లీ వెతకగా గ్రామస్తులకు కొండపై వారి మృతదేహాలు కనిపించాయి. చ‌నిపోయిన వారు శెట్టిబోయిన సిద్దయ్య (50), చాకలి నందు (22)గా గ్రామ‌స్ధులు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి.

Next Story