రాజస్థాన్‌లోని ఓ జడ్జిపై 14 ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. భరత్‌పుర్ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా తన కుమారుడిని లైంగిక వేధిస్తున్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మథుర గేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జడ్జి జితేంద్ర గొలియా ఏసీబీ కేసులను పరిశీలిస్తుంటారు. జడ్జితో పాటు అతని ఇద్దరు సహాయకులు తన కుమారుడిని లైంగికంగా వేధించినట్లు తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఎక్కడైనా బయటపెడితే తుపాకీతో షూట్ చేసి చంపుతామని జడ్జి బెదిరించారని తల్లి ఆరోపించింది.
Judge sexually abuses 14-year-old boyకాగా అక్కడి హైకోర్టు ఆదేశాలతో జడ్జి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కాగా.. బాలుడిని బెదిరించిన మరో అధికారి పరమేశ్వర్ లాల్ యాదవ్ కూడా సస్పెండ్ అయ్యారు. 14 ఏళ్ల వయస్సున్న తన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడని.. ఆటలాడుకునేందుకు రోజూ భరత్‌పుర్‌లోని గ్రౌండ్‌కు వెళ్తాడని తల్లి చెప్పింది. జడ్జి జితేంద్ర, అతని సహాయకులు కూడా అక్కడి వస్తుంటారని.. ఈ క్రమంలోనే నాకుమారుడితో వారు అసభ్యంగా వ్యవహారించడం ప్రారంభించారని ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ల ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయాక బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తల్లి ఆరోపించారు.