జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రికార్డు చేస్తూ నీటిలో దూకి మరణించాడని పోలీసులు తెలిపారు. తౌసిఫ్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి క్వారీలోని చెరువులోకి దూకాడు. సరస్సులో స్నానం చేస్తున్న అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారు స్థానికులు, పోలీసులను అప్రమత్తం చేసి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అతడి స్నేహితుడు రికార్డ్ చేస్తూ ఉండగా.. 100 అడుగుల ఎత్తు నుండి యువకుడు నీటిలోకి దూకడం కనిపిస్తుంది. అయితే నీటిలో పడిన వెంటనే అతడు ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కానీ కొన్ని సెకెండ్లలో అతడు మునిగిపోవడం మనం చూడొచ్చు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు చాలా నీటిలోకి దూకిన తర్వాత తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. దీంతో నీటిలో మునిగిపోయాడని తెలుస్తోంది.