రెండు బస్సులు ఢీ.. త‌ప్పెవ‌రిదో మొత్తం రికార్డు అయ్యింది

Head-On Collision Between Buses In Tamil Nadu. తమిళనాడులోని సేలంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన..

By Medi Samrat  Published on  18 May 2022 2:30 PM GMT
రెండు బస్సులు ఢీ.. త‌ప్పెవ‌రిదో మొత్తం రికార్డు అయ్యింది

తమిళనాడులోని సేలంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన.. ఒక వాహనంలో అమర్చిన కెమెరాలో రికార్డు అయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లు, 16 మంది ప్రయాణికులు సహా 18 మంది గాయపడ్డారు. వారందరికీ చికిత్స అందించిన తర్వాత విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎడప్పాడి నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు తిరుచెంగోడ్ నుంచి వస్తున్న కాలేజీ బస్సును ఢీకొట్టింది. కెమెరా రికార్డింగ్ ను కలిగి ఉన్న బస్సు, వేగంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. మరొక బస్సు వ్యతిరేక దిశ నుండి వస్తూ, రాంగ్ లేన్‌లోకి వెళ్లింది. ఈ ప్రమాదానికి కాలేజీ బస్సు డ్రైవర్‌ తప్పిదమే కారణమని పోలీసులు చెప్పారు. బస్సు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు సీటుపై నుంచి కిందపడిపోయారు.








Next Story
Share it