దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి త‌గ‌ల‌బెట్టారు..!

గ్రేటర్ నోయిడాలో ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని కుక్క పట్టీతో కట్టేసి చంపిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on  24 Oct 2024 5:02 PM IST
దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి త‌గ‌ల‌బెట్టారు..!

గ్రేటర్ నోయిడాలో ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని కుక్క పట్టీతో కట్టేసి చంపిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సదరు వ్యక్తి మృతదేహాన్ని టయోటా ఫార్చ్యూనర్ కారులో ఉంచి, వాహనాన్ని తగలబెట్టారు.

ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ సంజయ్ యాదవ్ ను చంపేశారు. నిందితులు విశాల్ రాజ్‌పుత్, జీత్ చౌదరిలతో కలిసి బాధితుడు మందు తాగాడు. నిందితులు మద్యం మత్తులో ఉన్నప్పుడు యాదవ్‌ ఒంటి మీద ఉన్న నగలు, అతడి దగ్గర ఉన్న నగదుపై కన్నేశారు. కుక్కలకు ఉంచే పట్టీతో గొంతు నులిమి హత్య చేశారు. నిందితులు యాదవ్ నుండి నగదు, నగలు దొంగిలించి అక్కడి నుండి వెళ్లిపోవాలని భావించారు. అతని మృతదేహాన్ని దాచే ప్రయత్నంలో ఫార్చ్యూనర్ కారును ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి మృతదేహాన్ని వాహనంలో ఉంచి వాహనానికి నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. కాలిపోయిన కారులో మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు.

యాదవ్ కుటుంబీకులు మిస్సింగ్ కంప్లయింట్ చేశారు. విచారణ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న వెనుక మ‌రికొంద‌రి హస్తం ఉండొచ్చ‌ని అనుమానిస్తున్న పోలీసులు ప్ర‌స్తుతం కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story