చిన్న గొడవ.. తోటి ఉద్యోగి తల నరికి హత్య.!
Ghaziabad man beheads co-worker over petty dispute, arrested. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో దారుణం జరిగింది. చిన్నపాటి వివాదం జరగడంతో ఓ వ్యక్తి తన తోటి ఉద్యోగి తల నరికి ఖాళీ స్థలంలో
By అంజి Published on
8 Dec 2021 3:22 AM GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో దారుణం జరిగింది. చిన్నపాటి వివాదం జరగడంతో ఓ వ్యక్తి తన తోటి ఉద్యోగి తల నరికి ఖాళీ స్థలంలో పడవేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుడు, సందీప్‌గా గుర్తించబడ్డాడు. సందీప్ అనే నిందితుడు తన తోటి ఉద్యోగి ప్రమోద్ కుమార్‌పై శత్రుత్వం పెంచుకుని అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశాడని ఎస్పీ (నగరం) జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. సందీప్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ప్రమోద్ కుమార్ సోమవారం రాత్రి మద్యం మత్తులో సందీప్ (35)ని కలవడానికి వెళ్లాడు. కుమార్ మద్యం మత్తులో ఉండడాన్ని అదును భావించాడు సందీప్. ప్రమోద్ కుమార్ తల నరికి పాలిథిన్ సంచిలో చుట్టి శంకర్ విహార్ కాలనీలోని ఖాళీ స్థలంలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రెండు గంటలకే కేవీ నగర్ పోలీసులు ఖాళీ స్థలం నుంచి కుమార్ తలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Next Story