బీజేపీ నేత ఇంట తీవ్ర విషాదం.. న‌లుగురు ఆత్మహ‌త్య‌

Four of former BJP state president's relatives die by suicide in Rajasthan. రాజస్థాన్‌ బీజేపీ నేత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.న‌లుగురు ఆత్మహ‌త్య‌

By Medi Samrat
Published on : 22 Feb 2021 7:39 AM IST

Four of former BJP state presidents relatives die by suicide in Rajasthan.

రాజస్థాన్‌ బీజేపీ నేత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన‌ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివ‌రాళ్లోకెళితే.. మదన్ లాల్ సైనీ సోద‌రుడు హనుమాన్ ప్రసాద్ త‌న‌యుడు 2020 సెప్టెంబరులో మృతిచెందాడు. దీంతో ఇంట్లోని వారంతా అప్ప‌టినుండి తీవ్ర‌ మానసిక వ్యథకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ స‌భ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

చ‌నిపోయిన వారిని హనుమాన్ ప్రసాద్, అతని భార్య తార, ఇద్దరు కుమార్తెలు అను, పూజలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో హనుమాన్ ప్రసాద్ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్ ల‌భ్య‌మైంది. అందులో కుమారుడు చ‌నిపోయిన‌ తరువాత నుండి మాకు బతకాలనే ఆశ లేదని పేర్కొన్నట్లు స‌మాచారం. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ సీకర్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Next Story