కాబోయే భర్త మరణించడంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ
Fiance’s death drives woman to suicide. 22 ఏళ్ల మహిళ రోడ్డు ప్రమాదంలో తన కాబోయే భర్త మరణించిన కొన్ని రోజుల తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 16 May 2022 5:28 AM GMT
22 ఏళ్ల మహిళ రోడ్డు ప్రమాదంలో తన కాబోయే భర్త మరణించిన కొన్ని రోజుల తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. బెంగుళూరులో బట్టల వ్యాపారి అయిన 23 ఏళ్ల ధనుష్, గ్రామంలో ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు తుమకూరులోని తన స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా నేలమంగళ వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ధనుష్, సుష్మ చాలా కాలం క్రితం ప్రేమలో ఉన్నారు. ఇటీవల వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇంతలోనే ధనుష్ మరణించడం ఆమెను కలచివేసింది. ధనుష్ అంత్యక్రియల్లో పాల్గొన్న సుష్మ మనస్తాపానికి గురై శనివారం విషం తాగింది. తల్లిదండ్రులు పలు ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయించే ప్రయత్నం చేసినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.
మస్కల్ గ్రామానికి చెందిన ధనుష్ కు బెంగళూరులో బట్టల షాపు ఉంది. సుష్మాతో పెళ్లి చేసుకోవాలనుకోగా.. మొదట్లో అందుకు ఒప్పుకోలేదు. ఈ నెల 11వ తేదీన గ్రామంలో జరిగే జాతరలో పాల్గొనడానికి ధనుష్ బైక్‌పై వస్తుండగా నెలమంగల దగ్గర ఉన్న కులానహళి వద్ద యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియుడి మరణ వార్త తెలిసిన సుష్మా తీవ్ర ఆవేదనకు లోనైంది. ప్రియుని ఆంత్యక్రియల్లో పాల్గొంది. ఆ మరుసటిరోజు పురుగుల మందు తాగింది. ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది.