గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on  16 May 2024 7:32 AM IST
గుర్తుతెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో జీపు గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది.

"ఎనిమిది మంది మరణించినట్లు ధృవీకరించబడింది.. మరొక వ్యక్తి గాయపడ్డాడు" అని రూపేష్ కుమార్ ద్వివేది తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత గుర్తు తెలియని వాహనం డ్రైవర్ పరారయ్యాడని ద్వివేది తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.

Next Story