భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకంటే.?

తన పుట్టినరోజుకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని ముక్కు మీద గుద్ది భర్తను చంపేసిన భార్య ఉదంతాన్ని మరువక ముందే కోపంతో ఓ మహిళ తన భర్త చెవిని కొరికేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Nov 2023 12:15 PM IST
భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకంటే.?

తన పుట్టినరోజుకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని ముక్కు మీద గుద్ది భర్తను చంపేసిన భార్య ఉదంతాన్ని మరువక ముందే.. కోపంతో ఓ మహిళ తన భర్త చెవిని కొరికేసింది. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. సుల్తాన్‌పురి ప్రాంతంలో ఓ మహిళ ఆవేశంతో తన భర్త కుడి చెవిని కొరికేసిందని పోలీసులు తెలిపారు. 45 ఏళ్ల బాధితుడి కుడి చెవి పై భాగం ఛిద్రమైపోవడంతో అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. భార్యా బాధితుడు తన భార్యపై ఫిర్యాదు చేశాడు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 324 కింద మహిళపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

నవంబర్ 20 ఉదయం 9.20 గంటల ప్రాంతంలో భర్త ఇంటిని శుభ్రం చేయమని అడిగాడు.. ఈ విషయమై భార్య అతడితో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ కాస్తా ఎక్కువైపోయింది. ఇంటిని అమ్మి వాటా ఇవ్వాలని.. విడివిడిగా ఉందామని భార్య కోరింది. అందుకు భర్త ఒప్పుకోలేదు. ఆమెకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించగా.. భార్య అతడిపై విరుచుకు పడింది. ఆమె నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించింది, కానీ నేను ఆమెను దూరంగా నెట్టివేసానని బాధితుడు పోలీసులకు తెలిపాడు. నేను ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు ఆమె వెనుక నుండి పట్టుకుంది.. కోపంతో కుడి చెవిని కొరికేయడంతో భర్త చెవి పైభాగం ఛిద్రమైపోయింది. నా కొడుకు నన్ను చికిత్స కోసం మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాడని బాధితుడు పోలీసులకు చెప్పాడు. రోహిణిలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. నవంబర్ 20న ఈ దాడి గురించి ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందిందని, దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని పంపామని పోలీసులు తెలిపారు. బాధితుడు నవంబర్ 22 న పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు.

Next Story