బాలికల అక్రమ రవాణా.. రూంలో నిర్బంధించి.. ఆపై

DCW rescues 5 girls from traffickers at Delhi. ఢిల్లీలో బాలికల అక్రమణ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠా నుంచి ఐదుగురు బాలికలను

By అంజి  Published on  23 Oct 2021 4:05 AM GMT
బాలికల అక్రమ రవాణా.. రూంలో నిర్బంధించి.. ఆపై

ఢిల్లీలో బాలికల అక్రమణ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠా నుంచి ఐదుగురు బాలికలను ఢిల్లీ మహిళా కమిషన్‌ రక్షించింది. బాలిక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అక్టోబర్‌ 19వ తేదీన ఎన్జీవో సంస్థ శక్తి వాహిని డీసీడబ్ల్యూకు సమాచారం అందించింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఐదుగురు బాలికలను ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తరలిస్తున్నారని తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డీసీడబ్ల్యూ చైల్డ్‌లైన్‌, పోలీసు అధికారులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ చేరుకుంది. బాలికలను అక్రమంగా రవాణ చేస్తున్న ముఠాను డీసీడబ్ల్యూ గుర్తించి అదుపులోకి తీసుకుంది. బాధిత బాలికలు మాట్లాడుతూ.. తమకు ఉద్యోగాలు ఇస్తామంటు జైనా అనే మహిళ, లాడెన్‌ అనే వ్యక్తి ఢిల్లీకి తీసుకువచ్చారని తెలిపారు. తమను మదన్‌పూర్‌ ఖదర్‌ విలేజ్‌లోని ఓ గదిలో నిర్బంధించినట్లు చెప్పారు. ఢిల్లీలోని కొందరు వ్యక్తులకు తమను అమ్మాలని ప్రయత్నించారన్నారు. నిందితులకు తెలిసిన వారు గత కొంత కాలంగా తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధిత బాలికలు తెలిపారు.

హైదరాబాద్‌లోనూ..

హైదరాబాద్‌లోనూ కోల్‌కతా నుంచి అపహరణకు గురైన బాలికను తెలంగాణ మహిళ భద్రతా విభాగం పోలీసులు రక్షించారు. జూన్‌ 19న పశ్చిమబెంగాల్‌లోని కునకల్‌ పీఎస్‌లో నమోదైన కేసు ఆధారాంగా బాలికను పోలీసులు రక్షించారు. 4 నెలల తర్వాత బాలిక(17)కు నిందితుడి చెర నుంచి విముక్తి లభించింది. కోల్‌కతాకు చెందిన సంతు పరమాణిక్‌.. అదే ప్రాంతానికి చెందిన బాలికను అక్రమంగా హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ సమాచారంతో రంగంలోకి దిగిన తెలంగాణ మహిళా భద్రత విభాగం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం దర్యాప్తు చేప్టటింది. నిందితుడి కాల్‌ డేటా ఆధారంగా చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాలికను సఖి కేంద్రానికి పంపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story