22 ఏళ్ల దళిత మహిళకు పాఠశాల విద్యార్థుల లైంగిక వేధింపులు

Dalit woman in TN sexually abused for 6 months. తమిళనాడులోని విరుదునగర్‌లో 22 ఏళ్ల దళిత యువతిపై పాఠశాల విద్యార్థులతో సహా

By Medi Samrat  Published on  22 March 2022 3:45 PM GMT
22 ఏళ్ల దళిత మహిళకు పాఠశాల విద్యార్థుల లైంగిక వేధింపులు

తమిళనాడులోని విరుదునగర్‌లో 22 ఏళ్ల దళిత యువతిపై పాఠశాల విద్యార్థులతో సహా ఎనిమిది మంది వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు ఆమె పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ముందు వారు దాదాపు ఆరు నెలల పాటు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధించారు. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. నేరస్తులను అరెస్ట్ చేశామని, వారు ఎవరైనప్పటికీ వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళను హరిహరన్ సంప్రదించాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. వారి మధ్య అనుబంధం ఏర్పడటంతో.. హరిహరన్ ఆగస్టు 20, 2021న ఆమెను మెడికల్ వేర్‌హౌస్‌కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి దిగి ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. హరిహరన్ తన స్నేహితులు ప్రవీణ్, జునైద్ అహ్మద్, 15 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు పాఠశాల విద్యార్థులతో వీడియోను పంచుకున్నాడు. వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని ఏడుగురు నిందితులు ఆమెను చాలాసార్లు బెదిరించారు. బ్లాక్‌మెయిల్ చేస్తూ వారు ఆరు నెలల వ్యవధిలో ఆమెపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

బాధితురాలికి తెలిసిన, డ్రైవర్‌గా పనిచేస్తున్న మాడసామిని సంప్రదించి, ఏడుగురు వ్యక్తులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి సహాయం కోరింది. మాడసామి ఆమె ఫోన్ నుండి ఆమె ప్రైవేట్ వీడియోను పొందాడు. సహాయం చేయకుండా ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. తన ఇష్టానికి కట్టుబడి ఉండకపోతే వీడియోను తల్లికి చూపిస్తానని బెదిరించాడు. వేధింపులు భరించలేక బాధితురాలు విరుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హరిహరన్, జునైద్ డీఎంకే యూత్ వింగ్ కేడర్ నాయకులని తెలుస్తోంది. మరోవైపు 15 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు మైనర్‌ పాఠశాల విద్యార్థులపై కేసు నమోదు చేసి జువైనల్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

Next Story
Share it