దానికి నిరాకరించిందని.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. చివరికి

Chennai man kills lover for refusing sex. చెన్నైలోని కుండ్రత్తూరు వద్ద పోలీసు బృందం శనివారం రాత్రి బస్టాప్‌లో రక్తంతో తడిసిన చొక్కాతో కూర్చున్న వ్యక్తిని పట్టుకుంది.

By అంజి  Published on  21 March 2022 11:16 AM IST
దానికి నిరాకరించిందని.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. చివరికి

చెన్నైలోని కుండ్రత్తూరు వద్ద పోలీసు బృందం శనివారం రాత్రి బస్టాప్‌లో రక్తంతో తడిసిన చొక్కాతో కూర్చున్న వ్యక్తిని పట్టుకుంది. వారు అతనిని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి తన ప్రియురాలిని చంపినట్లు అంగీకరించాడు. ఆదివారం ఆమెను హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. తెల్లవారుజామున 1 గంటలకు, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు బృందం రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి అతని చొక్కాపై రక్తపు మరకల గురించి ప్రశ్నించారు. ఆ వ్యక్తి తన పేరు రాజా, 38 ఏళ్ల వయస్సు అని పోలీసులకు చెప్పాడు. అతను వారిని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక మహిళ తన శరీరమంతా కత్తిపోట్లతో సగం నగ్నంగా పడి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆ మహిళను కుండ్రత్తూరులోని సెకిజార్ నగర్‌కు చెందిన కన్నమ్మ (40)గా గుర్తించారు. ఆమె అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తోంది. ఈ జంట గత ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. శనివారం రాత్రి, రాజా తన ఇంటికి వచ్చి శారీరక సంబంధం కోసం బలవంతం చేశాడని, అయితే ఆమె నిరాకరించిందని భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న రాజా ఆమెను తనతో పడుకోమని బలవంతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను రక్షించి రాజాను ఇంటి నుంచి బయటకు పంపించారు. అందరూ నిద్రించిన తర్వాత రాత్రి తర్వాత మళ్లీ రాజా ఆమె ఇంటికి వచ్చి కత్తితో పొడిచి చంపే ముందు ఆమెను ఇంటి లోపల బంధించాడు. "అతను హత్యకు ప్లాన్ చేసాడు" అని విచారణ అధికారి తెలిపారు. కుంరత్తూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి రాజాను అరెస్టు చేశారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.







Next Story