భ‌యంక‌ర‌మైన‌ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తిరుమంగళం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు

By Medi Samrat  Published on  10 April 2024 7:30 PM IST
భ‌యంక‌ర‌మైన‌ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తిరుమంగళం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. విల్లాపురానికి చెందిన కనగవేల్ తన కుటుంబంతో కలిసి తలవాయిపురంలో ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఫోర్‌వే లేన్‌లో నడుపుతుండగా ఆ కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

భారీ వేగంతో వచ్చిన కారు బైకర్ ను ఢీకొని అవతలి లైన్ లోకి దూసుకువెళ్లింది. కారులో ఉన్న కనగవేల్, అతని భార్య కృష్ణకుమారి, వారి బంధువులు నాగజ్యోతి, ఎనిమిదేళ్ల బాలికతో పాటు ద్విచక్ర వాహనదారుడు పాండి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కళ్లకురిచ్చి పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.

Next Story