ప్రియుడితో వెళ్ళిపోయిన కూతురు.. ఇంటికి వచ్చేయాలని ఒప్పించి తండ్రి ఏం చేశాడంటే..

తన కుమార్తె ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోవడంతో ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By Medi Samrat
Published on : 10 April 2025 7:33 PM IST

ప్రియుడితో వెళ్ళిపోయిన కూతురు.. ఇంటికి వచ్చేయాలని ఒప్పించి తండ్రి ఏం చేశాడంటే..

తన కుమార్తె ప్రియుడితో కలిసి ఢిల్లీకి పారిపోవడంతో ఆమెను హత్య చేశాడనే ఆరోపణలతో బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల సాక్షి అనే మహిళ ఏప్రిల్ 7న హత్యకు గురైందని, ఆమె మృతదేహాన్ని వారి నివాసంలోని తాళం వేసిన బాత్రూమ్ నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ముఖేష్ సింగ్ తన కుమార్తె సాక్షి ప్రియుడిని చంపడానికి ప్రయత్నించాడని సమాచారం, కానీ అతను గ్రామంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

సాక్షి మామ విపిన్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 4న ఆమె తన ప్రియుడితో ఢిల్లీకి పారిపోయిందని, అతను వేరే కులానికి చెందినవాడని తెలిపారు. సాక్షి ఇంటి దగ్గరే నివసించేవాడని, ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లేవారని కుమార్ చెప్పారు. మాజీ సైనికుడైన ముఖేష్ సింగ్ ఇంటికి వచ్చేయాలని ఒప్పించాడు. తిరిగొచ్చిన తర్వాత ఆమె అదృశ్యమైంది. సాక్షి తల్లి ముఖేష్ సింగ్ ను అడిగినప్పుడు, ఆమె మళ్ళీ ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పాడు. అయితే, తరువాత ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, వారి నివాసంలో తాళం వేసి ఉన్న బాత్రూమ్ నుండి దుర్వాసన వస్తున్నట్లు గమనించారు. అందులో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగ్‌ను పోలీసులు ప్రశ్నించగా, అతను నేరం అంగీకరించాడు.

Next Story