15 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్

Arrest of the boy who made the girl pregnant‌. బోయపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు.

By అంజి  Published on  21 Dec 2021 9:58 AM IST
15 ఏళ్ల బాలికను గర్భవతి చేసిన 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్

వాళ్లిద్దరు మైనర్లే.. తెలిసి తెలియన వయసు. అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడారు. ఆ తర్వాత మరింత దగ్గర అయ్యారు. దాని ఫలితమే మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణిగా తేలింది. ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ బోయపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. తొమ్మిదో తరగతి వరకు చదివిన బాలిక.. ఇంటి దగ్గరే ఉంటోంది.

అయితే అదే గ్రామానికి చెందిన బాలుడు కూడా ఇంటర్‌ పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బాలిక, బాలుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత మరింత దగ్గరయ్యారు. కొన్ని నెలల తర్వాత బాలిక అనారోగ్యం బారిన పడింది. తల్లిదండ్రులు బాలికను 30 రోజుల కిందట నర్సీపట్నం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా వైద్యుల పరీక్షల్లో బాలిక 8 నెలల గర్భిణీ అని తేలింది. దీంతో మైనర్‌ బాలిక పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం బాలుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలుడిని అరెస్ట్‌ చేసి జువెనైల్‌ హోంకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story