మద్యం మత్తులో తల్లి చేసిన దారుణాన్ని బయటపెట్టిన కొడుకు..

After killing the husband, the wife buried the body in the bathroom. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నగరంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని

By Medi Samrat  Published on  26 Feb 2022 6:10 PM IST
మద్యం మత్తులో తల్లి చేసిన దారుణాన్ని బయటపెట్టిన కొడుకు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నగరంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఈ విషయాన్ని కొడుకు మద్యం మత్తులో స్నేహితులకు చెప్పడంతో మొత్తం రహస్యం బయటకు వచ్చేసింది. తల్లి తండ్రిని హత్య చేసి బాత్‌రూమ్‌లో పూడ్చిపెట్టిందనే దారుణాన్ని బయటకు చెప్పాడు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్రిఖేడా సమీపంలోని కంకడ్‌లో నివసించే 50 ఏళ్ల సోను తన భర్త బబ్లూను హత్య చేసినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. విచారణలో భర్త రోజూ కొట్టేవాడని, దీంతో సోనూ తన స్నేహితుడితో కలిసి అతడిని హత్య చేసింది.

సోనూ తన స్టేట్‌మెంట్‌ను పదే పదే మారుస్తోందని పోలీసులు చెబుతున్నారు. అదే మహిళ 22 ఏళ్ల కుమారుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. బుధవారం మద్యం మత్తులో స్నేహితుల ఎదుట తల్లి తండ్రిని హత్య చేసి బాత్‌రూమ్‌ను పూడ్చిపెట్టిందని చెప్పాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మహిళను గురువారం అదుపులోకి తీసుకున్నారు. సోనూ ఇంటిలో పోలీసులు తవ్వకాలు మొదలు పెట్టారు. దీంతో గురువారం పోలీసులు ఇంటిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం సోనూ భర్త బబ్లూ మిస్సింగ్‌గా పోలీసులు పరిగణిస్తున్నారు. గత పది రోజులుగా ఇంటి చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాల‌లో త‌ను కనిపించడం లేదు.



Next Story