మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ముండన్ వేడుక కోసం మైహర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న వాహనం భారీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
భక్తుల వాహనంలో 22 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మందిని రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురు వ్యక్తులు సిద్ధి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బహ్రీ మార్గ్‌లోని ఉపని గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.