జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలము జిల్లాలోని హరిహర్‌గంజ్‌లో పికప్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి చెందగా, మరో 18 మంది గాయపడినట్లు అధికారి తెలిపారు. పాలములోని పంకికి చెందిన కార్మికులు పొరుగున ఉన్న బీహార్‌లోని సిహుడి గ్రామంలో వరి కోత తర్వాత తమ గ్రామానికి తిరిగి వస్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని అధికారి తెలిపారు.
ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మరణించారని ప్రమాద స్థలానికి చేరుకున్న హరిహరగంజ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జైప్రకాష్ నారాయణ్ తెలిపారు. హరిహరగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 12 మంది కూలీలు చికిత్స పొందుతున్నారని హరిహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుదామ కుమార్ దాస్ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన మరో ఆరుగురు కూలీలను మెరుగైన చికిత్స కోసం మేదినిరాయ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జాతీయ రహదారి 98పై ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.