డ్రమ్ములో ఐదు నెలల చిన్నారి మృతదేహం.. తల్లే హతమార్చింది..!
5-month-old baby found dead in water drum. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఐదు నెలల పాప మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది
By Medi Samrat Published on 27 Dec 2021 4:49 PM IST
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఐదు నెలల పాప మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా.. ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి శిశువును కన్న తల్లే హతమార్చింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చిన్నారి మృతి నీళ్లలో మునగడం వల్ల కాదని, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు చిన్నారి తల్లిని కఠినంగా విచారించగా అసలు విషయం బట్టబయలైంది. హత్యానేరం కింద పోలీసులు మహిళను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిన్నారిని తల్లి హత్య చేసిందని తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ కేసు జరిగిన ప్రదేశం పోలీసు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న కాల్వ ప్రాంతానికి చెందినది. నీరు నింపిన డ్రమ్ములో ఐదు నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది. అంతకుముందు.. మహిళ తన బిడ్డ కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు చిన్నారి కోసం వెతకగా.. నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహం తేలుతూ కనిపించింది. ఆ తర్వాత పోలీసులు చిన్నారి తల్లిపై అనుమానం వచ్చి విచారించారు. తన బిడ్డ నిరంతరం దగ్గుతోందని.. దగ్గుకు మందు వేశాను. మోతాదుకు మించి మందు వేయడంతో చిన్నారి మృతి చెందిందని విచారణలో పేర్కొంది. ఆమె భయపడి నీరు నింపిన డ్రమ్ములో చిన్నారి మృతదేహాన్ని విసిరింది. ప్రస్తుతం చిన్నారి మందు ఓవర్ డోస్ వల్ల చనిపోయాందా.. లేదా.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.