మోడల్ ప్రాణం తీసిన ఐరన్ పిల్లర్

24-year-old model dies after iron pillar falls on her during ramp walk in Noida's fashion show event. నోయిడాలోని ఫిల్మ్ సిటీ ప్రాంతంలోని ఓ స్టూడియోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా లైటింగ్ ఏర్పాటు

By Medi Samrat  Published on  12 Jun 2023 2:03 PM IST
మోడల్ ప్రాణం తీసిన ఐరన్ పిల్లర్

నోయిడాలోని ఫిల్మ్ సిటీ ప్రాంతంలోని ఓ స్టూడియోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా లైటింగ్ ఏర్పాటు చేసిన ఐరన్ ఫిల్లర్ మీద పడి మోడల్ వంశిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని మోడల్ వంశిక చోప్రాగా, గాయపడిన వారిని బాబీ రాజ్‌గా గుర్తించారు. మృతి చెందిన యువతి గ్రేటర్ నోయిడా గౌర్ సిటీ-2 నివాసి అని తెలిసింది.

మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. నోయిడా అదనపు డిప్యూటీ కమీషనర్ (ADCP) శక్తి అవస్తి మాట్లాడుతూ, “ఫిల్మ్ సిటీలోని స్టూడియోలో ఫ్యాషన్ షోలో ట్రస్ పడిపోవడం వల్ల వంశిక చోప్రా మరణించింది. మృతదేహానికి సంబంధించిన పంచనామాను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ”అని అన్నారు. వంశిక మృతి పట్ల పలువురు షాక్ కు గురవుతున్నారు.


Next Story