15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన 17 ఏళ్ల యువ‌కుడు.. కట్ చేస్తే పెళ్లి..

17-year-old boy kidnaps kin, marries. 17 ఏళ్ల బాలుడు.. 15 ఏళ్ల బాలికపై మనసు పారేసుకున్నాడు. ఇది టీనేజ్ లో ఉండే ఆకర్షణే

By Medi Samrat  Published on  10 Nov 2021 1:02 PM GMT
15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన 17 ఏళ్ల యువ‌కుడు.. కట్ చేస్తే పెళ్లి..

17 ఏళ్ల బాలుడు.. 15 ఏళ్ల బాలికపై మనసు పారేసుకున్నాడు. ఇది టీనేజ్ లో ఉండే ఆకర్షణే అని అనుకోవచ్చు..! కానీ అంతకుమించి ఆలోచించాడు ఆ బాలుడు.. ఆ బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఎత్తుకుని వెళ్లి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఈ ఘటన త‌మిళ‌నాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని భ‌వానీ తాలూకా ఒల‌గ‌డం గ్రామంలో చోటు చేసుకుంది. బాలుడు-బాలిక కుటుంబాల మ‌ధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. బాలుడు, ఆ బాలిక‌ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. ఆపై బ‌ల‌వంతంగా వివాహం కూడా చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాలిక స్థానికంగా 10వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

బాలిక కుటుంబంతో బంధుత్వం కారణంగా అదే గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలుడు త‌ర‌చూ వాళ్ల ఇంటికి వ‌చ్చేవాడు. రెండు రోజుల క్రితం బాలిక‌ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేష‌న్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేయగా ఆ బాలుడే ఆ బాలిక‌ను కిడ్నాప్ చేసిన‌ట్లు తేలింది. పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి వాళ్ల కోసం గాలించారు. వారికి ప‌ట్టుకున్నారు. అప్పటికే బాలికను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక‌ను కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. బాలుడిని అరెస్ట్ చేసి పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. జువైన‌ల్ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా కోర్టు నిందితుడిని జువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించాల‌ని పోలీసులకు ఆదేశించింది.


Next Story
Share it