Accident : మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 3 Nov 2025 4:44 PM IST

Accident : మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం

చేవెళ్ల రోడ్డు ప్ర‌మాదం మ‌రువ‌కముందే మ‌రో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. రోడ్డు నెం. 14 నుండి వస్తున్న ట్రక్కు పెట్రోల్ పంప్ సమీపంలో హైవేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా.. మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం SMS హాస్పిటల్ ట్రామా సెంటర్‌కు పంపారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

హర్మదా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ పలు వాహనాలను ఢీకొనడంతో 12 మంది మరణించారని, అదే సంఖ్యలో జ‌నాలు గాయపడ్డారని జైపూర్ కలెక్టర్ తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం.. జైపూర్‌లోని హర్మదాలో ఒక డంపర్ అనేక వాహనాలను ఢీకొట్టింది, 12 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. వీడియోలో ప్రమాదం తర్వాత భయంకరమైన దృశ్యాలు చూడ‌వ‌చ్చు. దీనిలో ట్రాఫిక్ క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తుంది. దెబ్బతిన్న వాహనాలు, దెబ్బతిన్న డంపర్ శిధిలాలు రోడ్డు పక్కన పడి ఉండటం చూడవచ్చు. అయితే అధికారులు ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.

Next Story