పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తే... ఈ 16 అంశాలు పాటించాల్సిందే..!

By Newsmeter.Network  Published on  7 Dec 2019 9:27 AM GMT
పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తే... ఈ 16 అంశాలు పాటించాల్సిందే..!

పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల విషయంలో సుప్రీం కోర్టు ఐదేళ్ల క్రితమే తెలిపిన అంశాలపై ఇప్పుడు లేవనెత్తుతున్నారు. కాగా, ఎన్ కంటర్ లో ఎవరైన ప్రాణాలు కోల్పోయినప్పుడు విచారణ నిమిత్తం ఎలాంటి అంశాలను పాటించాలి, ఉన్నతన్యాయస్థాయం ఏం చెబుతోంది ఓసారి చూసేద్దాం. ప్రాణాలు కోల్పోయిన సమయం ఉన్నతాధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి కేసు మూసేయడం కుదరదని ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ పోలీసులు 'దిశ' ఘటనపై చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను కస్టడీకి తీసుకుని విచారణలో భాగంగా బాధితురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటన స్థలానికి నిందితులను తీసుకువచ్చారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పారిపోయేందుకు యత్నించి, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. కాగా, దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సుప్రీం తీర్పు చర్చకు వస్తోంది. ఎన్‌కౌంటర్‌ దర్యాప్తులో 16 అంశాలను పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.

16 అంశాలు ఇవే...

1. ఫలానా ప్రాంతాల్లో నేరస్థులు తిరుగుతున్నారని సమాచారం అందినప్పుడు దాన్ని రికార్డు చేయాలి.

2. ఎన్‌కౌంటర్‌ లో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

3. అన్ని కేసుల లాగానే ఈ ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను కోర్టుకు పంపించాల్సి ఉంటుంది.

4. పోలీసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సీఐడీ దర్యాప్తు చేయాలి.

5. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియో చిత్రీకరించాలి.

6. మెజిస్టీరియల్ దర్యాప్తు జరపాలి.

7. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారాన్ని జాతీయ లేదా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఇవ్వాలి.

8. ఎఫ్ఐఆర్ ను, డైరీ ఎంట్రీలను, పంచనామాలను, ఇతర సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

9. కేసుపై వేగంగా అభియోగపత్రం నమోదు చేయాలి.

10. రాష్ట్రంలో జరిగిన ఇలాంటి అన్ని ఎన్‌కౌంటర్‌లపై ఆరు నెలలకోసారి ఒకసారి ఎన్ హెచ్ఎఆర్సీకి నివేదిక తప్పనిసరిగ్గా పంపాలి.

11. పోలీసులు తప్పుచేసి ఉంటే చర్యలు తీసుకోవాలి.

12. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి.

13. ఎన్‌కౌంటర్‌ కాగానే పోలీసులకు అవార్డులు ఇవ్వడం మానుకోవాలి.

14. అన్ని అనుమానాలు నివృత్తి అయ్యాకే వారిని అవార్డులకు పరిశీలించాలి.

15 పంచనామా సమయంలో క్లూస్‌టీం, ఫోరెన్సి నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించాలి.

16 పంచనామా అయ్యేంత వరకు మృతదేహాలను ఘటన స్థలం నుంచి తీయరాదు.

Next Story