విద్యార్థినులను లైంగికంగా వేధించిన.. ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్ అరెస్ట్

Teacher, professor arrested for sexually harassing students in Tamilnadu. కాలేజ్‌ ప్రొఫెసర్‌ అసభ్యకరమైన సందేశాలు పంపుతూ బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు.

By అంజి  Published on  19 Dec 2021 7:30 AM GMT
విద్యార్థినులను లైంగికంగా వేధించిన.. ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్ అరెస్ట్

రెండు వేర్వేరు సంఘటనల్లో చెన్నైలోని ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక కళాశాల ప్రొఫెసర్‌ను విద్యార్థినులను లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.

స్కూల్ టీచర్ అరెస్ట్

ఒక ప్రైవేట్ పాఠశాలలో 40 ఏళ్ల గణిత ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ క్లాస్‌లో తన విద్యార్థులతో అనుచితమైన వీడియోలు, ఫొటోలను షేర్ చేశాడని ఆరోపించిన తర్వాత లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టం కింద అరెస్టు చేశారు. అతనిపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో చెన్నైలోని తిరుమంగళంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో అతన్ని అరెస్టు చేశారు.

కాలేజ్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

మరొక సంఘటనలో చెన్నై శివార్లలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్ తన విద్యార్థినిలతో అనుచితంగా ప్రవర్తించాడు. క్లాస్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయాలంటూ విద్యార్థులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం అతనిపై ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని జల్లాదియన్‌పేటలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ బోధించే అబ్రహం అలెక్స్‌ (53)గా పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లుగా అసభ్యకరమైన సందేశాలు పంపుతూ బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు.

ఇటీవల, అతను క్యాంపస్‌లో ఒక అమ్మాయిని పట్టుకుని, మరో ముగ్గురిని వేధించాడు. నేరంపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా అతనిపై చర్యలు తీసుకోలేదని శుక్రవారం విద్యార్థులు నిరసన తెలిపారు. బాలికలు పోలీసు కంట్రోల్ రూమ్‌కు, మహిళల కోసం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అబ్రహం అలెక్స్‌పై సెక్షన్ 354 A(లైంగిక వేధింపులు), (లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్ లేదా అభ్యర్థన), తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Next Story
Share it