హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోలుకునేనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 July 2020 9:17 AM GMT
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోలుకునేనా..!

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. 2020 ప్రథమార్థంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని నిపుణులు అంటున్నారు. ఆఫీసు లావాదేవీలు దాదాపు 43 శాతం తగ్గాయని అంటున్నారు. గత నాలుగేళ్లలో ఇదే అతి తక్కువ అని చెబుతున్నారు. ఆఫీసు స్పేస్ కంప్లీషన్స్ విషయంలో కూడా 32 శాతం తక్కువగా నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ లో తెలిపింది.

ఇళ్ల అమ్మకాల విషయంలో కూడా 43 శాతం తగ్గిందని చెబుతూ ఉన్నారు. 4782 రెసిడెన్షియల్ యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయని ఈ ఏడాది ప్రథమార్థంలో నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ దశాబ్దంలోనే అతి తక్కువ అమ్మకాలు జరగడం ఈ ఏడాది లోనే అని చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుండి మార్చి నెలల్లో ప్రాపర్టీలకు భారీగా డిమాండ్ ఏర్పడిందని.. కానీ కరోనా మహమ్మారి ప్రబలడంతో పరిస్థితుల్లో చాలా తేడాలు వచ్చాయని అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.

దేశీయ ప్రాపర్టీస్‌ సంస్థ ’మ్యాజిక్‌ బ్రిక్స్‌’ సంస్థ మాత్రం కరోనా ప్రభావం నుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో బాగా మార్పులు వచ్చాయని తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం ప్రారంభంలోనే హైదరాబాద్‌ రియల్‌ రంగం మళ్లీ పట్టాలెక్కిందని చెబుతోంది.

2020 ఏప్రిల్‌– జూన్‌ నెలల మధ్య హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా నిర్మాణ రంగంపై కరోనా ప్రభావం, వర్తమాన పరిస్థితి, భవి ష్యత్తులో ఎలా ఉంటుందనే దానిపై నివేదికను మ్యాజిక్‌ బ్రిక్స్ తన వెబ్‌ సైట్‌లో ఉంచింది. గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో నిర్మాణ రియల్‌ ఎస్టేట్‌ ధరలు 50%పెరగ్గా, కరోనా పరిస్థితులు ఎదుర్కొన్న గత మూడు నెలల్లో 5.2% తగ్గాయని తెలిపింది.

Next Story