ఈ నగరాలను కరోనా నుంచి కాపాడటం కష్టమేనా..?

By సుభాష్  Published on  24 Jun 2020 4:39 AM GMT
ఈ నగరాలను కరోనా నుంచి కాపాడటం కష్టమేనా..?

దేశంలో కరోనా దెబ్బకు నగరాలు కాకవికలమవుతున్నాయి. కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా ఉన్నా.. తాజాగా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే.. నగరాల్లోనే అధికంగా కరోనా వ్యాప్తి ఉంది. అయితే ఇందుకు కారణం జనాభా ఎక్కువగా ఉండటం, లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటి వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని నిపుణులు గుర్తించారు.

మొత్తం 15 నగరాల్లో కరోనా వ్యాప్తి తీవ్రత

కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో దేశంలో 15నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ఈ కరోనా తీవ్రస్థాయిలో ఉంది. ఇక్కడి కఠినమైన నిబంధనలు విధించి చర్యలు తీసుకుంటే తప్ప కరోనా తగ్గే ప్రసక్తే లేదని, కరోనా మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మళ్లీ లాక్‌డౌన్‌ విధించి రూల్స్‌ పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకువాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో..

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కరోనా తీవ్రరూపం దార్చుతుంది. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో కరోనా వైరస్‌ కట్టడిలో ఉన్నా.. లాక్‌డౌన్‌ తర్వాత తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇతర జిల్లాల్లో కూడా గత కొన్ని రోజుల కిందట ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ జిల్లాల్లోనే కాకుండా మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తోంది. జిల్లాల్లో అక్కడక్కడ రెండు, మూడు కేసుల చొప్పున నమోదు కాగా, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ప్రతి రోజు వందక పైగా కేసుల నమోదవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 90 శాతం వరకు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కేసులు నమోదవుతుండటం గమనార్హం. అలాగే మరణాలు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో భౌతిక దూరం పాటించకపోవడం, జనాలు ఎడపెడ రోడ్లపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో చాలా మంది ఒకదగ్గర చేరి ఎలాటి మాస్కులు లేకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ కరోనా భయం అనేది లేకుండా పోతోంది. (ఇది చదవండి: ఇవి నిజమేనా..? కరోనా వ్యాప్తిలో వస్తున్నఅనుమానాలపై నిజాలు వెల్లడించిన పరిశోధకులు)

ముంబైలో..

ఇక ప్రధానంగా మహారాష్ట్రలో కూడా కరోనా తీవ్రస్థాయిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే ముంబైలో విశ్వరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో దాదాపు 90 శాతం ముంబైలోనే నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మహారాష్ట్రలో లక్ష కేసులు దాటితే అందులో సంగం కేసులు ఒక్క ముంబాయిలోనే ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోను పూణె నగరంలో దాదాపు 11వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే రాష్ట్రంలోని ఠాణే నగరంలోనూ కేసుల సంఖ్య పదహారు వేలు దాటింది. ఇక రాష్ట్రంలో్ని ఠాణే నగరంలోనూ కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నగరంలో కరోనా కేసుల సంఖ్య 16వేలు దాటింది.

చెన్నైలోనూ..

ఇక చెన్నైనగరంలోనూ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. తమిళనాడులో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నైనగరంలోనే ఉన్నాయి. ఇక కేసుల సంఖ్య తీవ్రంగా ఉండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రతి ఇంటికి వైద్య బృందాలను పంపి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. (ఇది చదవండి: కరోనాపై జపాన్ విజయం.. కరోనా నియంత్రణలోకి రావడానికి కారణాలేంటి..!)

ఢిల్లీలో ప్రమాద ఘంటికలు

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా అంతే ఉంది. లాక్‌డౌన్‌ మినహాయింపు తర్వాతనే నగరాల్లో మరిన్ని కేసులు పెరిగాయని ముఖ్యమంత్రులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. ఏదేమైనా నగరాలను సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతుంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి విషయంలో అధికారులు కఠిన చర్యలు చేపడితే తప్ప తగ్గే అవకాశం లేదని, మున్ముందు మరింత వ్యాప్తి చెంది భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (ఇది చదవండి: కరోనా వైరస్‌పై సంచలన ప్రకటన చేసిన వుహాన్‌ వైరాలజీ లాబ్‌ డైరెక్టర్‌)

Next Story