ప్రాణం తీసిన చిప్స్‌ ప్యాకెట్‌ ఫ్రీ టాయ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2020 9:19 AM GMT
ప్రాణం తీసిన చిప్స్‌ ప్యాకెట్‌ ఫ్రీ టాయ్‌

పిల్లలు మారం చేస్తున్నారు కదా అని తినడానికి ఏది కనిపిస్తే అది కొంటే ప్రాణాలమీదకే వస్తుంది. విజయనగరం జిల్లాలోని ఓ గిరిజన పల్లెలో అదే చోటు చేసుకుంది. చిప్స్‌తో పాటు బొమ్మ ఉచితంగా వస్తుంది కదా అని.. ఓ ప్యాకెట్ కొనిచ్చిన తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది. వారి పాప మృత్యువాత పడడంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు.

గరుగుబిల్లి మండలం, చిన్నగుడబ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలగ సంధ్య తన కుమార్తె మౌనిక కోసం క్రాక్స్ రింగ్ ప్యాకెట్ కొనిచ్చింది. పాప ఆ రింగ్స్ తింటూనే ప్యాకెట్‌లో గిఫ్ట్‌గా ఇచ్చిన చిన్న బొమ్మను కూడా మింగేసింది. ఆ బొమ్మ గొంతులో అడ్డుపడడంతో పాప ఊపిరి పీల్చుకోలేకపోయింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు గుండెల‌విసేలా రోధిస్తున్నారు.

Next Story
Share it