పరీక్ష రాసేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 5:43 AM GMT
పరీక్ష రాసేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి..

పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాళ్లోకెళితే.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్‌ డైట్‌సెట్‌ పరీక్ష రాసేందుకు బైక్‌పై ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు.

మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్‌ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

విషయం తెల‌సిన శ్వేత, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు తిరిగిరాని లోకాల‌కు వెళ్ల‌డంతో వారి ఇళ్ల‌ల్లో విషాదం నిండుకుంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it