ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

By సుభాష్  Published on  3 Oct 2020 4:29 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెళగావి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బెళగావి జిల్లా రామదుర్గం తాలుకాలోని చించనూరు గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ధార్వాడ జిల్లా మోరట గ్రామంలో కూలి పనులకు వెళ్లి శుక్రవారం రాత్రి టాటా ఏస్‌లో తిరిగి వస్తుండగా, సవదత్తి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌ పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, చిన్నారి ఉన్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it