చంద్రయాన్ -2 తొలి ఫొటో విడుదల !!!

By సత్య ప్రియ  Published on  18 Oct 2019 6:05 AM GMT
చంద్రయాన్ -2  తొలి ఫొటో విడుదల !!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్‌ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్‌ తీసింది. ఈ ఇమేజ్‌ను కొద్ది రోజుల ముందే విడుదల చేసినప్పటికీ ఆ చిత్రం ఆధారంగా దానిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ తలం యొక్క వివరాలను ప్రకటించింది.

ఉత్తర అర్థ గోళాన్ని చిత్రీకరించిన ఫొటోలో మనం సోమర్‌ఫెల్డ్, స్టెబిన్స్, కిర్క్‌వుడ్ బిలాలను గుర్తించి ప్రత్యేకంగా వివరించింది. ఐఐఆర్ఎస్ తీసిన ఇమేజ్ ఆధారంగా తలంపై సూర్యుని కాంతి పడుతుండగా దానిని చంద్రుని కాంతి ఎంత వరకూ పరావర్తనం చెందించగలుగుతుందనే వివరాలను వెల్లడించింది.

చంద్రుడి ఉపరితలం ప్రాథమిక విశ్లేషణలో ఐఐఆర్ఎస్ విజయవంతమైంది. సోలార్ రేడియేషన్ పరావర్తనం చెందడంలో పలు దశలను వెల్లడించింది. తలంలోని పలు దశలను సవివరంగా తెలిపింది. జులై 22న ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం సెప్టెంబరు 7న చంద్రుని తలంపై అడుగుపెట్టాల్సి ఉంది. కమ్యూనికేషన్ కోల్పోవడంతో హార్డ్ ల్యాండింగ్ అయి చివరి దశలో ఫెయిలైంది.





Next Story