భారత్‌లో గడిచిన 24 గంటల్లో 991 కరోనా కేసులు

By సుభాష్  Published on  18 April 2020 2:42 PM GMT
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 991 కరోనా కేసులు

కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. చాపకింద నీరులా ప్రవహిస్తున్న కరోనా వైరస్‌.. దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 991 కేసులు నమోదు కాగా, 43 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకూ 480కి చేరింది. దేశంలోని 23 రాష్ట్రాల్లో ని 45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్తగా కేసులేమి నమోదు కాలేదని తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,378కి చేరగా, ఇప్పటి వరకూ 1992 మంది కోలుకున్నారని పేర్కొన్నారు.

దేశంలో 73 శాతం కరోనాతో మరణించిన వారు 60 ఏళ్లకుపైబడిన వారు ఉన్నారని అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలన సృష్టంచిన ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల గురించి లవ్‌ అగర్వాల్‌ పలు వివరాలు తెలియజేశారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 4,291 మర్కజ్‌కు సంబంధించినవేనిన స్పష్టం చేశారు. అత్యధికంగా తమిళనాడులో 84 శాతం నమోదు కాగా, ఢిల్లీలో 63, తెలంగాణలో 79, ఏపీలో 50శాతం, యూపీలో 59శాతం కరోనా కేసులు మర్కజ్‌కు లింకులు ఉన్నవేనని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై కేంద్ర వేగవంతంగా చర్యలు చేపడుతోందని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా ఎలాంటి మందులు వాడవద్దని సూచించారు. ఇక ఏపీలోని విశాఖలో ఇప్పటి వరకూ కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులేవి నమోదు కాలేదని, ఏపీ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ఆయన ప్రశంసించారు.

Next Story