సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
By Medi Samrat Published on 13 July 2020 12:34 PM GMTసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇంటర్మీడియట్ ఫలితాలను సోమవారం అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది 88.78 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఇది గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 5.38 ఎక్కువగా కావడం విశేషం. ఫలితాల్లో త్రివేండ్రమ్ 97.67 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. పట్నా 74.57 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో ఉంది. ఫలితాలకై విద్యార్థులు cbse.nic.in సైట్‌లో లాగిన్ అయి తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
ఇదిలావుంటే.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సీబీఎస్ఈ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్ధులు ఇప్పటికే రాసిన పరీక్షల్లో వారు చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది.
ఇందులో భాగంగా.. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి.. రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి.. ఢిల్లీ అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు నేడు సెకండియర్ ఫలితాలను వెల్లడించింది.