వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2020 9:26 AM ISTపశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే, వైసీపీ నేత తలారి వెంకట్రావుపై కేసు నమోదు అయ్యింది. 2017 డిసెంబర్‌లో తన ఇంటిపై దాడి చేశారని పోలీసులను ఆశ్రయించిన ద్వారకా తిరుమల మండలం మాలసానికుంటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
ఏపీలో పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపుNext Story