బంగారం ధర ఎంతంటే.. కాస్త తగ్గిన వెండి ధర..!
Today Gold Rates. బంగారం ధరలో పెద్దగా మార్పు లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర నిలకడగానే
By Medi Samrat Published on 26 July 2021 10:40 AM IST
బంగారం ధరలో పెద్దగా మార్పు లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర నిలకడగానే కొనసాగుతోంది. వెండి రేటు పడిపోయిందని అధికారులు చెబుతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర రూ.48,770 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 వద్ద స్థిరంగా ఉంది. వెండి రేటు మాత్రం పడిపోయింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,000 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. 0.04 శాతం పడిపోయింది. బంగారం రేటు ఔన్స్‌కు 1801 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 25.22 డాలర్లకు క్షీణించింది.
ఇటీవలే బంగారం ధర కాస్త తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX మార్కెట్‌లో శుక్రవారం రాత్రి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.25 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.47,510కు క్షీణించింది. బంగారం ధర గత ఐదు సెషన్లలో ఏకంగా రూ.1000 మేర దిగివచ్చింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.22 శాతం క్షీణతతో కేజీకి రూ.67,520కు తగ్గింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరకు 10 గ్రాములకు రూ.46,500 వద్ద మద్దతు లభిస్తోందని నిపుణులు చెప్పారు.