లాక్‌డౌన్: రోడ్డెక్కిన బస్సులు
By సుభాష్ Published on 26 April 2020 8:17 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పట్టవచ్చని అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రంలో మాత్రం బస్సులు రోడ్డెక్కాయి. ముందురోజు దాదాపు 12వేలకు పైగా బస్సులు నడిచే అవకాశం ఉందని రవాణాశాఖ అంచనా వేస్తోంది. కాగా, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు లేకుండా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గువాహటి నుంచి దాదాపు 17వేల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్దమయ్యాయని తెలుస్తోంది. అందులో 550 బస్సులు బర్పెట, 413 బస్సులు నాగావ్, 420 బస్సులు గోల్‌పర, 103 బస్సులు మోరీగావ్, 239 బస్సులు సొంటిపూర్‌కు వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, రెడ్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలకు బయటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఇళ్లకే పరిమితం చేయనున్నారు.
అతి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న అసోంలో ఇప్పటి వరకూ 36 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో 19 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని ప్రజల సౌకర్యార్థం బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
�