టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిల్‌.. ప్రభుత్వాలకు, ట్రాయ్‌కు హైకోర్టు నోటీసులు

By సుభాష్  Published on  26 April 2020 2:12 AM GMT
టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో పిల్‌.. ప్రభుత్వాలకు, ట్రాయ్‌కు హైకోర్టు నోటీసులు

టిక్‌ టాక్‌.. ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా టిక్‌ టాక్‌కు బానిసైపోయారు. ఏది పడితే అది వీడియో చేయడం టిక్‌టాక్‌లో పెట్టేయడం.. ఇది ఒక ట్రెండ్‌లా మారిపోయింది. టాక్‌టాక్‌ వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో ఉన్నాయి. ఇక టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అశోక్‌రామ్‌ కుమార్‌ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టిక్‌టాక్‌ వల్ల కరోనాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన హైకోర్టుకు వివరించారు.

సర్కార్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తున్నారని ఆయన పిల్‌లో వివరించారు. కాగా, ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు, ట్రాయ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొందరు యువతి టిక్‌టాక్‌ వీడియోల్లో మతపరమైన అంశాలుంటున్నాయని, ఈ వీడియోల వల్ల మతాల పరంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో టిక్‌టాక్‌ను నిషేధించాలని ఆయన కోరారు.

టిక్‌టాక్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు

కాగా, ఏప్రిల్‌ 9వ తేదీన న్యాయవాది టక్‌టాక్‌ కస్టమర్‌ సపోర్ట్‌ బృందానికి ఈమెయిల్‌ ద్వారా ఓ ఫిర్యాదు చేశాడు. టిక్ టాక్‌ వీడియోలు కొన్ని అభ్యంతకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని మెయిల్‌లో కోరారు. అయితే మూడు రోజుల తర్వాత ఆ వీడియోలను తొలగించినట్లు మెసేజ్‌ రాగా, తర్వాత మళ్లీ పరిశీలించగా, వీడియోలు తొలగించకుండా అందులోనే ఉన్నాయని న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. మార్చి నెలలో కూడా ఇలాంటి వీడియోలపై హైదరాబాద్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story