సినీ నటి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతున్న తరుణంలో కొన్ని లోపాలున్నా..వాటిని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి బాసటగా నిలువాలని ఇటీవల కేసీఆర్‌ మీడియా సమావేశంలో చెప్పారని, కానీ గాంధీ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని రాసిన ఓ మీడియా యాజమాన్యానికి కరోనా రావాలని శాపం పెట్టారని విజయశాంతి మండిపడ్డారు. వైద్య సదుపాయాలు లేవన్నందుకే కరోనా రావాలన్న కేసీర్‌.. గాంధీ ఆస్పత్రి జైలు మాదిరిగా మారిందని విమర్శలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని రాములమ్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బహుశా కేసీఆర్‌ పెట్టిన శాపం గురించి అక్బరుద్దీన్‌కు తెలిసి ఉండకపోవచ్చని, లేకుండా కేసీఆర్‌ పెట్టిన శాపాలు తనకు వర్తించవనే ధీమాలో అక్బరుద్దీన్‌ ఉండొచ్చని ఎద్దేశా చేశారు. రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌ శాపం పెడతారా.. లేక చూసీ చూడనట్లు ఉండిపోతారా అంటూ విజయశాంతి వ్యాఖ్యనించారు.

కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు…

Vijayashanthi ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಶುಕ್ರವಾರ, ಏಪ್ರಿಲ್ 24, 2020

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.