ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. కారణం అదేనంటున్న తాజా అధ్యయనం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 12:05 PM IST
ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. కారణం అదేనంటున్న తాజా అధ్యయనం

అంచనాలకు బిన్నంగా.. ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేలాది కేసులు రోజులోనమోదు కావటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేసుల నమోదును మాత్రం అడ్డుకోలేని పరిస్థితి. దీంతో.. ఏపీలో వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందన్న అభిప్రాయం ఈ మధ్యన ఎక్కువైంది.

ఈ ఆందోళన నేపథ్యంలో అమెరికన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ సంస్థతో పాటు బర్మింగ్ హోం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. తాజాగా కొన్ని అంశాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

గడిచిన కొద్ది రోజులుగా కరోనా కేసుల నమోదు కంటే కూడా.. బాధితుల్లో ఆందోళనే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. కరోనా పాజిటివ్ వారి కారణంగా తమకూ వైరస్ సోకుతుందన్న అనుమానం ఎక్కువ మంది ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ ఆందోళన.. భయం.. ఒత్తిడి కారణంగా సామాజిక వ్యాప్తి జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే.. ఆసియా దేశాల్లోనే ఆందోళన ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు.

అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. ఏపీ యువకుల్లో ఇలాంటి ఆందోళన చాలా ఎక్కువగా ఉందని.. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఏపీ యువకులతో పోలిస్తే.. పెద్ద వయస్కులే ఎక్కువ ధైర్యంగా ఉన్నారని సదరు అధ్యయనం చెబుతోంది. వారు.. త్వరగా కోలుకుంటున్నారని చెప్పింది. ఆందోళన లేకుంటే రక్తంలో ఆక్సిజన్ నిల్వలు నిలకడగా ఉంటాయని.. కరోనా టైంలో యాంగ్జైటీ అస్సలు ఉండకూదని చెబుతున్నారు.

Next Story