ఏపీ బీజేపీ నూతన కమిటీ ప్ర‌క‌ట‌న‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 10:59 AM GMT
ఏపీ బీజేపీ నూతన కమిటీ ప్ర‌క‌ట‌న‌

ఏపీ బీజేపీ కొత్త కమిటీని ప్రకటించింది. మొత్తం 40 మందితో అధ్య‌క్షుడు సోమువీర్రాజు త‌న‌ కొత్త టీమ్ సిద్ధం చేశారు. 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, పదిమంది రాష్ట్ర మోర్చా అధక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులతో ఏపీ బీజేపీ నూత‌న‌ కమిటీ ఏర్పాటయింది.

ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మీ, మాలతీరాణి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌళిని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు, మధుకర్, ఎల్. గాంధీల‌ను నియ‌మించారు.

పార్టీలో సీనియర్లకు క్యాడర్ పెంచ‌గా.. కోశాధికారిగా సత్యమూర్తిని నియ‌మించారు. ఇక అధికార ప్రతినిధులుగా భాను ప్రకాష్‌రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్. శ్రీనివాస్ ల‌ను ఎన్నుకోగా.. ఆఫీస్ సెక్రటరీగా పి. శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు.Next Story
Share it