Video: అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది: జగన్

వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు

By Knakam Karthik
Published on : 8 May 2025 4:48 PM IST

Andrapradesh, Ys Jagan, Ysrcp, Ap Government, Tdp, Janasena, Bjp

అధికారంలోకి వచ్చాక సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది: జగన్

వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల బాధలు, కష్టాలను స్వయంగా చూస్తున్నా. అందుకే జగన్ 2.Oలో టాప్ ప్రయారిటీ కార్యకర్తలకే ఇస్తా. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లను నోట్ చేసి పెట్టుకోండి. వాళ్లకి యూనిఫామ్ విలువ ఏంటో తెలిసేలా చేస్తా. రిటైర్ అయినా, దేశం దాటినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకువస్తాం. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షిస్తాం. తీసుకొచ్చాక వారికి సినిమా మామూలుగా ఉండదు..వేరే లెవెల్‌లో ఉంటుందంతే..అని జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

Next Story