చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్‌ కళ్యాణ్ పై

By Medi Samrat  Published on  15 April 2024 7:00 PM IST
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం జరిగిన దాడి నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్‌ కళ్యాణ్ పై వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. ఈ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి వెనుక కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై అవసరమైన చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా వారిని ఆదుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము ECని కోరుతున్నామని తెలిపారు సజ్జల. సీఎంపై దాడి జరిగితే డ్రామా అనడం సరికాదని అన్నారు. వైఎస్‌ జగన్‌కు నాటకాలు, డ్రామాలు ఆడటం రాదని.. చంద్రబాబు దాడిని ఖండిస్తున్నామంటూనే డ్రామాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. డ్రామాలాడేవారైతే గాయాన్ని ప్రజలకు చూపించేవారు.. గతంలో గానీ, ఇప్పుడు గానీ జనాలకు గాయాన్ని చూపించలేదన్నారు సజ్జల.

Next Story