ఆ జ‌నాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతుంది : అనిల్ కుమార్ యాదవ్

సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

By Medi Samrat  Published on  26 Feb 2024 4:18 PM IST
ఆ జ‌నాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతుంది : అనిల్ కుమార్ యాదవ్

సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

దాదాపు 15 లక్షల మందికిపైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నామ‌న్నారు. మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చావాకులు పేలాడని విమ‌ర్శించారు. మొన్న లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్న‌యో అందరికీ తెలుసని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడని అన్నారు. హోల్‌సేల్‌గా కాపులందరినీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టుపెట్టాడని వ్యాఖ్యానించారు.

Next Story